అనంతపురం జిల్లా శింగనమల మండలం మరువకొమ్మ వద్ద రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటుగా వెళ్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని సీపీఐ నాయకులను అడ్డు తప్పించారు. ఎమ్మెల్యేను అక్కడినుంచి పంపించారు.
ఇదీ చదవండి: 'తెదేపా సానుభూతిపరుల ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకే రీసర్వే'