అనంతపురం జిల్లా కదిరి విద్యుత్ కేంద్రం ఎదుట వామపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. కష్టకాలంలో ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో అదనపు భారాన్ని మోపుతోందని నిరసనకారులు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను తగ్గించటంతోపాటు, తెల్లరేషన్ కార్డు దారులకు బకాయిలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'మంత్రిగా చెబుతున్నా...వారిని తొలగించం'