అనంతపురం జిల్లాలోని ఆసుపత్రుల్లో పడకల కొరత వేధిస్తుండటం గమనించిన సీపీఎం నేతలు.. రచయిత సింగమనేని నారాయణ పేరిట కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరికి సహకరించిన మెడికల్ రెప్స్ అసోసియేషన్, జిల్లా టెక్నికల్ ఆఫీసర్ సంఘాలు.. తమ భవనాలను కేంద్రం ఏర్పాటుకు ఇచ్చాయి.
కార్మిక దినోత్సవం నాడు ఆ భవనాల్లో 50 పడకలతో కొవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. వీరికి సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రవాసాంధ్రులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపారు. నాణ్యమైన భోజనం, నిరంతర వైద్య సేవ మాత్రమే కాక.. బాధితుల మానసిక ఆరోగ్యానికీ చర్యలు తీసుకున్నట్లు సీపీఎం నాయకులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: