ETV Bharat / state

ఆస్తి తగాదే... దంపతుల హత్యకు కారణమా..? - crime news in anantha puram

డి హిరేహాళ్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు... దంపతులను రాళ్లుతో, కట్టెలతో కొట్టి హత్య చేశారు.

దారుణం: దంపతులను హత్య చేసిన దుండగలు
దారుణం: దంపతులను హత్య చేసిన దుండగలు
author img

By

Published : Nov 29, 2019, 11:28 PM IST

ఆస్తి తగాదే... దంపతుల హత్యకు కారణమా..?

అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణ హత్య జరిగింది. డి హిరేహాళ్ మండలంలోని గొల్లబసవరాజు, లక్ష్మీదేవి దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లు, కర్రలతో దాడి చేసి చంపారు. కొన్ని రోజులు కిందట బసవరాజుకు వారి దాయాదులకు ఆస్తి గురించి ఘర్షణలు జరుగుతున్నాయని... ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని బంధువులు, స్థానికులు తెలిపారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి

గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు

Reporter : j.sivakumar Rayadurgam Anantapuram (dist) ap 8008573082 * ఆస్తి తగాదా విషయమై దంపతులు దారుణ హత్య అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హిరేహాల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి జంట హత్యలు చోటుచేసుకున్నాయి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలో నిద్రిస్తున్న గొల్ల బసవరాజు 55 లక్ష్మీదేవి 45 అనే దంపతులను బండరాళ్లు కర్రలతో దారుణహత్య చేశారు వీరికి జయలక్ష్మి అనే కూతురు ఉంది ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల నడుమ కొన్ని రోజులుగా విభేదాలు ఏర్పడ్డాయి హత్యకు గురైన బసవరాజు లక్ష్మీదేవి తన కూతురు జయలక్ష్మి కి తమ ఆస్తి చెందాలని కొన్ని రోజులుగా దాయాదుల నడుము ఘర్షణ చోటుచేసుకుంది ఆస్తి పంపకాల విషయమై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది అన్నదమ్ముల ఆస్తి తమకే చెందాలని మృతుడు బసవరాజు వద్ద ఏర్పడ్డ తగాదాలే హత్యకు కారణమని చెబుతున్నారు బంధువులు కుటుంబ సభ్యులు మాత్రం ఆస్తి తగాదాలే జంట హత్యకు కారణాలని పేర్కొన్నారు కళ్యాణదుర్గం డిఎస్పీ ఎం.వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అనంతపురం నుంచి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం రప్పించి హత్యకు కారకులైన నిందితుల కోసం భారీగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు నిందితుల కోసం భారీగా గాలిస్తున్నారు డి హిరేహాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.