ETV Bharat / state

గుంతకల్లులో విస్తరిస్తోన్న కరోనా..ప్రత్యేక చర్యలు చేపడుతున్న అధికారులు

అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొవిడ్ నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో పాటు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

corona positive cases incresed in gunthakal ananthapuram districtcorona positive cases incresed in gunthakal ananthapuram district
గుంతకల్లులో విస్తరిస్తోన్న కరోనా
author img

By

Published : Jun 20, 2020, 6:27 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా పురపాలక అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్రామిక రైళ్ల ద్వారా పట్టణ వాసులు వస్తున్నందున.. అధికారులు వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారు నివసిస్తున్న ప్రాంతాలను ప్రత్యేక జోన్​గా ప్రకటించి స్థానికులను గృహ నిర్బంధంలో ఉండేలా చూస్తున్నామని కమిషనర్ అన్నారు.

బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం... భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రస్తుతం పట్టణానికి చెందిన తొమ్మిది మంది జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లారని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని చెప్పారు.

ఇదీచదవండి.

రేపే సూర్య గ్రహణం.. నేటి సాయంత్రం నుంచే లేదు ఆలయ దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.