అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో లాక్డౌన్ కొనసాగుతోందని డీఎస్పీ వెంకటరమణ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆయన పట్టణంలో లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. సోమవారం నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు... అన్ని దుకాణాలు తెరుస్తున్నట్లు జోరుగా తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు. ఈ విషయమై లిఖితపూర్వకంగా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే లాక్డౌన్ని కఠినంగా అమలు చేస్తామని... ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: తల్లిదండ్రులూ ఈ జాగ్రత్తలు పాటించండి..!