అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంజునాథ థియేటర్ వద్ద నివాసముంటున్న ఓ వ్యక్తికి జలుబు, జ్వరం ఉండటం వల్ల స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. వారం కిందట ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్ వెళ్లినట్లు సమాచారం. అక్కడినుంచి వచ్చినప్పటి నుంచి జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల ఆయనే పరీక్షల కోసం వచ్చినట్లు తెలిసింది. ఈయన్ను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించిన తరువాత అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించామని... కరోనా ఉందని తాము స్పష్టం చేయలేదని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి :