ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్​ స్టాఫ్​ నర్సుల నిరసన - ఏపీ వార్తలు

కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ వైద్య ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కరోనా ఉద్ధృతి వేళ ప్రాణాలకు తెగించి సేవలందించామని.. తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో మృతిచెందిన వైద్య సిబ్బంది కుటుంబాలకు 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్​ స్టాఫ్​ నర్సుల రాష్ట్ర వ్యాప్త నిరసనలు

author img

By

Published : Jun 18, 2021, 9:47 PM IST

పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం ఘోష ఆసుపత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ ఆసుపత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరోనా బారిన మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. లేని పక్షంలో జీజీహెచ్, మండల కేంద్రాల్లో ఈనెల 28న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వైద్యసిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.

పాడేరులో పొరుగు సేవల వైద్య సిబ్బంది ఆందోళనల బాట పట్టారు. ఫ్రంట్​లైన్ వారియర్స్​గా పనిచేస్తోన్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తమ డిమాండ్లను ఈనెల 28లోగా తీర్చాలని లేనట్లయితే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, సిబ్బంది, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు.

అనంతపురం జిల్లాలో.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పారామెడికల్ ఒప్పంద కార్మికులు చేస్తున్న ఆందోళన 19వ రోజుకు చేరింది. జీవో ఆర్టీ నెంబరు 299/14-06-2021 ను సవరించి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర కమిటీ కన్వీనర్ జాన్ సన్ , జిల్లా కన్వీనర్లు నర్సారెడ్డి ,గంగరాజు , వీరశేఖర్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: fishing problems: కొవిడ్‌ ధాటికి డీలాపడిన జాలర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.