ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... కానిస్టేబుల్ మృతి - crime news in annthapuram district

అనంతపురం జిల్లా కొడమనాయునిపాలెం వద్ద ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతిచెందాడు.

constable died in road accident at annthapuram district
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... కానిస్టేబుల్ మృతి
author img

By

Published : Jun 10, 2021, 7:14 PM IST

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలోని నారసింపల్లి తండాకు చెందిన హరిలాల్ నాయక్.. తనకల్లు పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. హరిలాల్ తన స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై కదిరి వెళ్తున్నాడు. ఇదే సమయంలో కదిరికి చెందిన చంద్రశేఖర్.. నల్లమాడ వైపు వెళ్తున్నాడు. కొండమనాయునిపాలెం మలుపు వద్ద వీరి ద్విచక్రవాహనాలు పరస్పరం ఢీ కొన్నాయి.

ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ హరిలాల్ నాయక్ మృతి చెందాడు. ప్రమాద స్థలాన్ని కదిరి తహసీల్దార్ మారుతి, పట్టణ సీఐ శ్రీనివాసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి: కరోనా కేసుల్లో తగ్గుదల... కొత్తగా 8,110మందికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.