అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందపురం ఎంపీటీసీ స్థానం రిజర్వేషన్ విషయంలో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయింటినట్టు అధికారులు చెబుతుండగా.. అభ్యర్థులు మాత్రం జనరల్ గా పొరపాటు పడిన విషయం స్పష్టమవుతోంది. నామినేషన్ల సందర్భంగా.. ఐదుగురు పురుషులు, ఓ మహిళ ఈ స్థానానికి బరిలో నిలవగా.. పరిశీలన అనంతరం ఐదుగురు పురుషుల నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. అధికారులు గందరగోళం సృష్టించిన కారణంగానే.. ఈ పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు వాపోయారు. స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కు పరిస్థితి వివరించి.. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా చూడాలని కోరారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని సబ్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే వైకాపా నేతలు.. ఇలాంటి కుట్రలు చేస్తున్నారని తెదేపా హిందూపురం నియోజకవర్గ పర్యవేక్షకుడు హనుమంతరాయచౌదరి విమర్శించారు.
ఇదీ చదవండి:
'మా అభ్యర్థుల నామపత్రాలు చించేస్తుంటే.. పోలీసులు స్పందించరా?'