అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ప్రతి అయిదేళ్లకు ఒకసారి దేవాంగులు, తొగటులు వేరువేరుగా నిర్వహించే చౌడేశ్వరీ పంచమ జ్యోతుల ఉత్సవాలు.. ఉదయం గంగాజలం ఊరేగింపు నిర్వహించి ప్రారంభించారు. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయాల్లో చౌడేశ్వరి అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజల తర్వాత జ్యోతుల వేడుకం ప్రారంభమవుతుంది.
తిరిగి శుక్రవారం ఉదయానికి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఇప్పటికే చౌడేశ్వరీ దేవి ప్రధాన ఆలయాల వద్ద, ప్రధాన దారుల మీదుగా దీపాలంకరణ చేశారు. గంగాజలం ఊరేగింపు ఎంతో ఆకట్టుకుంది. మేళతాళాల మధ్య.. డప్పు వాయిద్యాల నడుమ కార్యక్రమం కొనసాగింది. కళాకారుల వేషధారణ చూపరులను ఆకట్టుకుంది.
ఇదీ చదవండి: