ETV Bharat / state

పోలీసుల అత్యుత్సాహం...వైద్యం అందక చిన్నారి మృతి! - కళ్యాణదుర్గం వార్తలు

child died
child died
author img

By

Published : Apr 15, 2022, 10:08 PM IST

Updated : Apr 16, 2022, 8:12 PM IST

22:03 April 15

అనంతపురం జిల్లాలో ఘటన

అనంతపురం జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి నియోజకవర్గానికి వస్తుందని.. కల్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు సందర్భంగా ఆ మార్గంలో పోలీసులు.. వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్​ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆ వాహనం ట్రాఫిక్​లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో... ఆ చిన్నారి మృతి చెందింది.

బాలిక మృతిపై కుటుంబసభ్యుల ఆందోళన చేపట్టారు. పోలీసులు అత్యుత్సాహంతోనే.. తమ కూతురు చనిపోయిందిని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

పోలీసుల తప్పులేదు: కల్యాణదుర్గంలో బాలిక మృతిపై ఎస్పీ ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. బాలిక మృతిలో పోలీసుల తప్పులేదని చెప్పారు. బాలికను తీసుకెళ్తున్న బైక్‌ను పోలీసులు ఆపలేదన్న ఎస్పీ.. ఆస్పత్రికి దారి చూపించి బాలికను పంపించారని చెప్పారు. ఎవరి ప్రమేయంతోనో.. కొందరు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఎస్పీ.

ఇదీ చదవండి: అనుమానాస్పద స్థితిలో.. హైకోర్టు న్యాయవాది మృతి

Last Updated : Apr 16, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.