రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు, సత్యసాయి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయికల్వంత్ మందిరంలోని సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కొన్ని విభాగాలను ఈరోజు ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి.
'నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తాం'