అనంతపురంలో ప్రముఖ వైద్యుడు, తెదేపా సీనియర్ నేత డాక్టర్ కేశన్న మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య వసతుల అభివృద్దికి, నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు కేశన్న ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అనంతపురంలో వైద్యసేవలతో పాటు వైద్యవిద్య అభివృద్దికి పాటుబడ్డారని కొనియడారు. ఇస్కాన్ తదితర స్వచ్ఛంద సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చిన వితరణశీలి అని తెలిపారు. డాక్టర్ కేశన్న కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇవీ చదవండి