ఎరువు కోసం తమ పొలంలో ఉన్న నల్ల మట్టిని తీసుకొని వెళ్తుండగా.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారని అనంతపురం జిల్లా విడపనకల్ మండలం కొట్టాలపల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. వరదల ద్వారా పొలాల్లో ఉన్న నల్లమట్టి వంకల్లోకి వస్తుందని.. ఆ మట్టినే ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నామని రైతులు తెలిపారు. ఇంత చిన్న విషయానికే పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీచదవండి.