ఒకే రోజులో 122 మంది పేకాటరాయుళ్లు అరెస్టు - కదిరి పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
అనంతపురం జిల్లా కదిరి గ్రామీణ పోలీసులు పేకాట స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో తలుపుల, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు మండలాల్లో ఒకే రోజు 122 మంది పేకాటరాయుళ్లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 4 లక్షల 28 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కదిరి సీఐ మధు తెలిపారు.