అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జనచైతన్య నగర్ కాలనీలో.. మురుగు పారుదల అస్తవ్యస్తంగా మారిందని కాలనీవాసులు నిరసన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. పార్టీ నాయకులు, స్థానికులు ర్యాలీగా వెళ్లి ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఎంతోమంది రోగాలు బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నా.. పట్టించుకునే నాథులు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ రోడ్ల పైకి వ్యర్థాలు వస్తున్నాయని.. పందులు ఇంటి చుట్టూ సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గాండ్లపెంటలో ఆలయ భద్రతకు సీసీ కెమెరాలు అందించిన యువకులు