అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి హత్యకు కారణమైంది. అన్నదమ్ములైన జూతప్ప, దాలప్ప మధ్య ఆస్తి గురించి 15 రోజులుగా వివాదం జరుగుతోంది.
ఈ క్రమంలో జూతప్ప కుమారులైన నరేంద్ర, ఓబిలేశు, నరసింహా... దాలప్ప కుమారులపై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో చినరాజప్ప మృతి చెందగా.. అతని సోదరుడు చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: