రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆరోపించారు. జెేసీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా అధికారులు.. రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పాలనను ప్రజలు చూడలేదన్నారు.
ఎవరికీ అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కలవకుండా అడ్డుపడిన పోలీసులపై ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి: తెదేపా నేతల అరెస్టులపై నిరసనలు తీవ్రతరం