అనంతపురం జిల్లా కదిరిలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోరుతూ... బీజేవైఎం చేపట్టిన దీక్షను భగ్నం చేయటంపై భాజపా నాయకులు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఆమరణ దీక్ష చేపట్టిన వైకాపా నాయకులు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్న హామీని... అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. కదిరి శాసన సభ్యుడు సిద్ధారెడ్డి అవగాహన లేకుండా... తమపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి : ఇసుకలేక... కార్మికులు పస్తులుంటున్నారు: మాణిక్యాలరావు