ETV Bharat / state

'మా ఫ్లెక్సీలు చింపినవారిని వెంటనే అరెస్టు చేయండి' - హిందూపురంలో భాజపా నిరసన

అనంతపురం జిల్లా హిందూపురం - బెంగళూరు బైపాస్​ వద్ద భాజపా కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. తమ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను చించినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

bjp agitation at hindhupuram
హిందూపురం- బెంగళూరు బైపాస్​ వద్ద భాజపా రాస్తారోకో
author img

By

Published : Dec 21, 2020, 4:34 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో భాజపా నాయకుల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ విషయంపై.. భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం - బెంగళూరు బైపాస్​ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఫ్లెక్సీలను చించివేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్​కు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఎంతకూ వినని కారణంగా వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

కనుమరుగవుతున్న ఒంగోలు జాతి పశువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.