కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం అనంతపురం జిల్లాలో వైకాపా ఎన్ఆర్ఐ, ఐటీ విభాగం బయో డిస్ఇన్ఫెక్టెడ్ టన్నెల్‌ను ప్రభుత్వానికి అందించింది. అనంతపురంలోని కలెక్టరేట్లో ఈ టన్నెల్‌ను కోవిడ్ ప్రత్యేక అధికారి విజయానంద్, కలెక్టర గంధం చంద్రుడు ప్రారంభించారు. సాధారణ సోడియం హైపో క్లోరైడ్ టన్నెల్ కన్నా ఇది భిన్నంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 7 సెకన్లు అందులో ఉంటే ఎలాంటి వైరస్‌నైనా చంపేస్తుందని కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా రోజులో ఎక్కువ మందికి స్ప్రేయింగ్ చేయవచ్చన్నారు.
ఇదీ చదవండి..