ETV Bharat / state

చదువుకు దూరంగా.. నిర్లక్ష్యానికి దగ్గరగా! - ప్రారంభానికి నోచుకోని బాలికల గురుకుల భవనం

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శ్రీ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో రూ. 13 కోట్లు మంజూరు చేసింది. భవణ నిర్మాణ పనులు నిలిచిపోవటంతో విద్యాలయం ఆవరణలో ముళ్లకంపలు పెరిగాయి. అధికారులు స్పందించి నిర్మాణ పనులు పుర్తి చేసేలా తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Away from education  close to neglect
చదువుకు దూరంగా.. నిర్లక్ష్యానికి దగ్గరగా!
author img

By

Published : Feb 22, 2021, 4:30 PM IST

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శ్రీ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో 2014లో ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేసింది. బాలయోగి గురుకుల పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 10 శాతం పూర్తయితే పేద విద్యార్థులు చదువుకు అడ్డంకులు తొలగుతాయి. అధికారులు దృష్టిసారించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటంలేదు. ప్రస్తుతం కొర్రపాడులోనే ఓ కుట్టు శిక్షణ కేంద్రం భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 600 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ భవనం ఇరుకుగా ఉండటంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో విద్యాలయం ఆవరణలో ముళ్లకంపలు పెరిగాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులు పూర్తిచేసి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.