ETV Bharat / state

పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం.. బ్యాలెట్ పత్రాలు ఎత్తుకెళ్లేందుకు యత్నం - అనంతపురం జిల్లాలో రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నం తాజా వార్తలు

అనంతపురం జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉరవకొండ ఆది ఆంధ్ర పాఠశాలలోని 15వ పోలింగ్ కేంద్రంలో.. బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన 8, 9, 10 పోలింగ్ కేంద్రాల్లో మరికొందరు రిగ్గింగ్ కు యత్నించారు.

Attempt to pick up ballot papers
అనంతలో పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం
author img

By

Published : Apr 8, 2021, 10:10 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ఉరవకొండ ఆది ఆంధ్ర పాఠశాలలోని 15వ పోలింగ్ కేంద్రంలో.. బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లడానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఏపీవో గట్టిగా కేకలు వేయటంపై స్పందించిన హోంగార్డ్ వెంటనే అక్కడికి వెళ్లాడు. అప్పటికే కొన్ని బ్యాలెట్ పత్రాలను చించి దుండగుడు పరారయ్యాడు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో... పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన 8, 9, 10 పోలింగ్ కేంద్రాల్లో కొందరు రిగ్గింగ్ కు యత్నించగా.. పోలింగ్ సిబ్బంది వీడియో తిసేందుకు ప్రయత్నించారు. గమనించిన సదరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. పలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేసి ఓట్లు వేశారని పలువురు ఆరోపించారు.

ఇవీ చూడండి:

దర్శి వైకాపాలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.