ETV Bharat / state

దొంగ అరెస్ట్.. 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - latest ananthapuram district news

అనంతపురం జిల్లాలో ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 24 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ananthapuram district
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్.. 24 వాహనాలు స్వాధీనం
author img

By

Published : Jun 10, 2020, 2:05 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్ డీఎస్పీ కసీం సాహెబ్ ఆదేశాల మేరకు డోనేకల్ చెక్​పోస్ట్ వద్ద విడపనకల్ మండలానికి చెందిన భాస్కర్ అనే ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనం దొంగలించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ కోసం గాలిస్తుండగా భాస్కర్​ పట్టుబడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన 24 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో 7, కర్నూల్ జిల్లాలో 10, కడపలో 1, కర్ణాటక 7 ద్విచక్రవాహనాలు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో చొరవ చూపిన విడపనకల్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇది చదవండి 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు ... విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.