ETV Bharat / state

'మా ఊరికి ఎవరూ రావొద్దు.. ఊరి నుంచి ఎవరూ వెళ్లొద్దు' - అరకటివేములలో కరోనా పాజిటివ్ వార్తలు

కరోనా వ్యాప్తిస్తున్న వేళ.. అధికారుల కంటే గ్రామస్తులే అప్రమత్తంగా ఉంటున్నారు. ఓ గ్రామంలోని వ్యక్తికి కరోనా సోకిందని అక్కడికి ఎవర్నీ రానివ్వట్లేదు. అక్కడి గ్రామస్తులంతా.. గడప దాటి బయటకు పోకుండా ఆంక్షలు విధించుకున్నారు.

announcement on corona with  traditional indian drum in arakativemula
అరకటివేములలో కరోనాపై డప్పు చాటింపు
author img

By

Published : Jun 3, 2020, 3:21 PM IST

"మా ఊరికి ఎవరూ రావొద్దు.. ఊరి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దు" అంటూ అనంతపురం జిల్లా అరకటివేముల గ్రామంలో డప్పు చాటింపు (టముకు) వేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంపై.. అక్కడి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల కంటే ముందే స్పందించిన గ్రామస్తులు.. ఈ మేరకు ఆంక్షలను విధించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని.. అందరికీ సూచించారు. మరోవైపు.. కరోనా సోకిన వ్యక్తి కాంటాక్ట్స్​ను పోలీసులు గుర్తించారు. అందరినీ క్వారంటైన్​కు పంపించారు.

ఇదీ చూడండి:

కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.