అనంతపురం జిల్లా కొత్తకోటకు చెందిన సుమారు 200 మంది వలస కూలీలు కొన్ని నెలల కిందట ముంబయి లోని డోంగ్రీ జిల్లా దానాబందర్ వాడిబందర్ ప్రాంతాలకు వలస వెళ్లారు. కరోనా వ్యాప్తి... లాక్ డౌన్ నేపథ్యంలో వారం రోజులుగా అక్కడ పనులు ఆగిపోయాయి. స్వగ్రామానికి వెళ్లేందుకు సైతం అవకాశాలు లేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా గుర్తింపు కార్డులు ఉన్నవారికి అక్కడి ప్రభుత్వం నుంచి సాయం అందుతుండగా... మిగిలినవారికి ఎలాంటి సాయం అందట్లేదు. రాష్ట్ర అధికారుల నుంచి వినతి వస్తే వారిని పంపడానికి తాము అభ్యంతరం చెప్పబోమని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నట్లు వారు తెలిపారు. అధికారులు తక్షణం స్పందించాలని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... తమను ఆదుకోవాలని సీఎం జగన్కు వీడియో ద్వారా వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: