కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలోని బుడబుక్కల కాలనీ వాసులు వారి కాలనీకి అడ్డుకట్ట వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో... తమవారు ఎవరూ బయటకు వెళ్లడం లేదని... బయటివారు ఎవరూ లోనికి రానివ్వడం లేదని స్పష్టం చేశారు. యువకులు వంతుల వారీగా కాపు కాస్తున్నారని తెలిపారు. కాలనీలో అందరూ కూలి పనిచేస్తూ జీవనం సాగించేవారని... గత కొద్ది రోజులుగా పనులకు వెళ్లక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేసి ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు.. 12కు పెరిగిన సంఖ్య