ETV Bharat / state

అనంతలో దారుణహత్యలు - pattikonda palli murder case latest news

అనంతపురం జిల్లాలో గత నెల 24న జరిగిన సంజీవమ్మ హత్య కేసులో అనూహ్య విషయాలు వెలుగుచూశాయి. సంజీవమ్మ.. అక్రమ సంబంధానికి అడ్డు చెప్పటంతో నిందితుడు రామాంజనేయులు ఆమె తలపై రుబ్బురోలుతో మోది అంతమొందించాడు. నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు విచారించగా.. నాలుగేళ్ల క్రితం నిందితుడు తన భార్యను హతమార్చినట్లు తేలింది.

భార్యను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన భర్త

author img

By

Published : Jun 8, 2020, 10:29 PM IST

Updated : Jun 9, 2020, 11:23 AM IST

అనంతపురం జిల్లా పత్తికొండపల్లి గ్రామంలో గత నెల 24న జరిగిన సంజీవమ్మ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో నిందితుడు రామాంజనేయులు అక్రమసంబంధానికి అడ్డు వస్తోందని నాలుగేళ్ల క్రితం తన భార్యను హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. ఉప్పర రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన ఉప్పర సంజీవమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రామాంజనేయులు భార్య మారెక్కకు విషయం తెలియటంతో ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్రమ సంబంధానికి అడ్డువస్తుందని నాలుగేళ్ల క్రితమే భార్య మారెక్కను.. సంజీవమ్మతో కలిసి రామాంజనేయులు హత్య చేశాడు. మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టాడు. అప్పటి నుంచి సంజీవమ్మతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఇటీవల సంజీవమ్మ తన సంతానం పెద్దవారు అవుతున్నారని... ఇకపై అక్రమసంబంధం కొనసాగించలేమని అడ్డుచెప్పడం మొదలుపెట్టింది. సంజీవమ్మ కోసం భార్యను హత్య చేసిన రామాంజనేయులు సంజీవమ్మ అక్రమ సంబంధానికి ఒప్పుకోకపోవటంతో ఆగ్రహం చెందాడు. గత నెల 24న సంజీవమ్మ ఇంటివద్ద నిద్రిస్తుండగా అర్ధరాత్రి రుబ్బురోలుతో తలపై కొట్టాడు. ఆసుపత్రికి తరలించగా మే 25న సంజీవమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. సంజీవమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడు రామాంజనేయులుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... నాలుగేళ్ల ముందు జరిగిన నిందితుడి భార్య హత్య విషయం వెలుగు చూసింది.

ఈ కేసులో ఉప్పర రామాంజనేయులును పోలీసులు రిమాండ్​కు పంపించారు. అనంతరం కోర్టు అనుమతితో నిందితుడు భార్య మారెక్క హత్యకు సంబంధించి ఫోరెన్సిక్ అధికారులు, వైద్యులు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన మారెక్క మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం మారెక్క అస్థిపంజరాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండు హత్యలకు సంబంధించి నిందితుడు ఉప్పర రామాంజనేయులుపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడి మృతి

Last Updated : Jun 9, 2020, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.