ETV Bharat / state

మద్యం కోసం అనంతపురం నుంచి రాప్తాడుకు..! - lock down in anatapura latest news

అనంతపురంలో ఆదివారం నుంచి లాక్​డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ కారణంగా మద్యం ప్రియులకు కష్టాలు మొదలయ్యాయి. మద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫలితంగా మద్యం దుకాణాలు తెరిచి ఉన్న ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు.

lock down in anatapura
అనంతపురంలో లాక్​డౌన్
author img

By

Published : Jun 21, 2020, 4:14 PM IST

అనంతపురం నగరంలో ఆదివారం నుంచి లాక్​డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఫలితంగా మద్యం ప్రియులకు కష్టాలు మొదలయ్యాయి. లాక్​డౌన్ కారణంగా నగరంలో దుకాణాలు, వ్యాపార సముదాయాలకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మద్యం దుకాణాలను చాలా వరకు మూసివేశారు. ఈ కారణంగా నగరానికి సమీపంలో ఉన్న రాప్తాడు వద్దకు మందుబాబులు క్యూ కట్టారు. రాప్తాడులోని మద్యం దుకాణం వద్ద ఉదయం నుంచి భారీ క్యూలైన్ కనిపించింది. అక్కడికి వచ్చినవారంతా అనంతపురం నగర వాసులేనని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.