ETV Bharat / state

Police Rescue Youngman: కిడ్నాప్‌ చెర నుంచి పోలీసుల రక్షణ.. ఒక్కటైన ప్రేమ జంట

author img

By

Published : Dec 29, 2021, 9:01 AM IST

youngman kidnap: అనంతపురంలో కిడ్నాపర్ల నుంచి ప్రేమికులను పోలీసులు కాపాడారు. పెద్దలకు ఇష్టం లేని వివాహం చేసుకున్నారని యువతి తరఫు బంధువులు యువకుడిని కిడ్నాప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు అరగంట వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు.

కిడ్నాప్‌ చెర నుంచి పోలీసుల రక్షణ
కిడ్నాప్‌ చెర నుంచి పోలీసుల రక్షణ

attack on lovers: అనంతపురంలో కిడ్నాపర్ల నుంచి ప్రేమికులను పోలీసులు కాపాడిన సంఘటన మంగళవారం జరిగింది. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల నవీన్‌కుమార్‌, ఇర్ఫాన బేగం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాప్తాడు సమీపంలోని పండమేరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం పెద్దలకు ఇష్టం లేకపోవడంతో నవీన్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేయాలని యువతి తరఫు బంధువులు ఏడుగురు కుట్రపన్నారు.

పెళ్లి చేసుకున్న ప్రేమికులు నగరంలోని అరవింద్‌నగర్‌లో ఓ దుకాణంలో అంతకుముందే ఉంచిన తమ దుస్తులు తీసుకొనేందుకు వచ్చారు. ఇది గమనించిన అమ్మాయి తరఫు బంధువులు యువకుడిని ఓ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. వీరి నుంచి తప్పించుకున్న యువతి జిల్లా ఎస్పీని సంప్రదించింది. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో రెండో పట్టణ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అరగంట కాలవ్యవధిలో ప్రసన్నాయపల్లి రైల్వేగేలు సమీపంలో కిడ్నాపర్లను పట్టుకున్నారు. ప్రేమికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా నవీన్‌ కుమార్‌ నగరంలోని అరవింద్‌నగర్‌లో ఒక ట్రావెల్స్‌లో పని చేస్తున్నాడు. ఇర్ఫాన్‌ బేగం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. సకాలంలో స్పందించిన రెండో పట్టణ సీఐ జాకీర్‌హుసేన్‌, ఎస్సై రాంప్రసాద్‌ ఇతర పోలీసులను ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి:

Akhanda Producer: 'సినిమా 'అఖండ' విజయమని ముందే చెప్పేశా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.