ETV Bharat / state

కరోనాను జయించారు.. ప్లాస్మాను దానం చేశారు

కరోనాను జయించిన అనంతపురం పోలీసు సిబ్బంది.. ప్లాస్మా దానం చేశారు. వారిని జిల్లా ఎస్పీ అభినందించారు. కరోనాను జయించి విధుల్లోకి హాజరైన సిబ్బందికి సన్మానం చేశారు.

anantapur sp
ప్లాస్మాను దానం చేసిన అనంతపురం పోలీసులు
author img

By

Published : Jul 28, 2020, 11:12 PM IST

ప్రజారోగ్య భద్రత కోసం కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందు వరసలో నిలిచి పోరాడుతున్న పోలీసులు మరో త్యాగం చేశారు. జిల్లాలో కరోనాను జయించిన 17 మంది పోలీసులు మంగళవారం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో ప్లాస్మా దానం చేశారు. కరోనా తీవ్రత అధికమై ప్రాణాలతో పోరాడే ప్రజలకు.. ప్లాస్మా థెరపీకి వీరి రక్తం ఉపయోగపడనుంది.

anantapur sp
ప్లాస్మాను దానం చేసిన అనంతపురం పోలీసులు
ప్లాస్మా దానం చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏసుబాబు అభినందించారు. రక్తదానం చేసిన వారిలో ఒక ఆర్ ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, 11 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నారు. కరోనాను జయించిన 17 మంది పోలీసులకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా శాలువా కప్పి సన్మానం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.