అనంతపురం జిల్లా మడకశిరలో గత కొన్ని రోజులుగా ఓ మహిళ రావి చెట్టు కిందే కాలం వెళ్లదీస్తోంది. ముక్కుపచ్చలారని ఇద్దరు కుమారులతో బతకుబండి సాగిస్తోంది. ఆమె పరిస్థితిపై ఆరా తీస్తే... కన్నీళ్లకేకన్నీళ్లు తెప్పించింది ఆమె దీనగాథ. మడకశిర మండలంలోని యు.రంగాపురం చెక్పోస్ట్ గ్రామానికి చెందిన ఆమె భర్త మూడు నెలల క్రితం ఓ ప్రాణాంతక వ్యాధితో చనిపోయాడు. నా అన్న వారు ఎవరూ లేరు. భర్త మరణంతో సంపాదన లేక ఇలా రోడ్డున పడింది. తరచూ అనారోగ్యం బారిన పడిన ఆమెనూ అదే మహహ్మారి మింగేస్తోందని తెలిసింది.
అప్పటి వరకు దారినపోయే వారు చేసే సాయంతో నెట్టుకొచ్చిన ఆమెను ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవరించింది. భయం మొదలైంది. భర్త మరణంతోనే అన్నీ వదిలేసుకున్న ఆమెకు... చావు పెద్ద కష్టంగా అనిపించడం లేదు. కానీ పిల్లలు ఏమైపోతారనే ఆలోచనే ఆమెను కుంగదీస్తోంది. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది.
ఇవీ చదవండి...బతుకు బండి ఆగింది.. జీవనం భారంగా మారింది..