జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలం పరిధిలోని మోపిడి, ఆమిద్యాల, రాకెట్ల గ్రామాల్లో గ్రామ సచివాలయ, ఆర్బీకే, హెల్త్‌క్లినిక్ భవనాలను పరిశీలించారు. నాణ్యత పాటించాలని అధికారులకు తెలిపారు. ఆమిద్యాలలో జగనన్న ఇళ్ల లేఅవుట్లను ఆమె పరిశీలించారు.
ఇంటిని నిర్మించుకునేంత ఆర్థికస్థోమత లేదని, కనీసం పునాదుల నిర్మాణం చేపట్టలేని స్థితిలో ఉన్నామని ఆమిద్యాలలో కొందరు మహిళా లబ్ధిదారులు కలెక్టర్‌కు విన్నవించారు. అలాంటి మహిళలకి డ్వాక్రా సంఘాల రుణాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్‌కు ఇసుకరేవు 40 కి.మీ దూరంలో ఉంటే, రేవు నిర్వహించే వ్యక్తే లబ్ధిదారుని వద్దకు చేర్చే విధానాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సొంత స్థలాలు, లేఅవుట్లలో వచ్చేనెల 1, 3, 4 తేదీల్లోపు గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు.
మోపిడి సచివాలయ సిబ్బందిని ఒక్కొక్కరిగా వారివారి జాబ్‌చార్ట్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములై లబ్ధిదారులకు బాసటగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌గౌడ్, జేడీఏ రామకృష్ణ, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీవో దామోదర్‌రెడ్డి, ఉరవకొండ సర్పంచి లలితమ్మ, సచివాలయ సిబ్బంది, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: