అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టురుమానికి చెందిన సుంకమ్మ (75 ) కొవిడ్‌తో మరణించింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరు ముందుకు రాలేదు. ఈ క్రమంలో గ్రామస్థులు కొందరు ఉరవకొండ ఆపద్భాందవ ట్రస్ట్‌కు విషయం తెలిపారు. వారు గ్రామానికి చేరుకొని.. పీపీఈ కిట్లు ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ ఊరి బయట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంస్థ కరోనా సమయంలో ఎంతో మంది అనాథలకు ఆహారం అందించడం.. ఎవరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వీరి మానవత్వం చూసి పలువురు అభినందించారు. అయిన వల్లే అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఆపద్బాంధవుల్లా వచ్చి సహాయం చేసిన వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండీ.. ఆగని రెమ్‌డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు