అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని... హిందూపురం రోడ్డు విస్తరణపై రాజకీయ పార్టీల అభిప్రాయం కోసం కదిరి మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలోని 42వ నెంబరు జాతీయ రహదారి నుంచి హిందూపురం రోడ్డు కోనేరు కూడలి వరకు విస్తరణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. రెండ్రోజుల క్రితం రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసాల యజమానులతో సమావేశమైన అధికారులు, ఇవాళ రాజకీయ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు.
సమావేశానికి హాజరైన నాయకులందరూ రహదారి విస్తరణకు ఎటువంటి అభ్యంతరం లేదని, అధికారులు పారదర్శకతతో వ్యవహరిస్తే సహకరిస్తామన్నారు. రహదారి విస్తరణ, నిధుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందని, వాస్తవిక పరిస్థితులు వివరించాలని పలువురు నాయకులు సూచించారు. పట్టణ వాసులకు నష్టం వాటిల్లకుండా విస్తరణ పనులు చేపడితే సహకరిస్తామని నాయకులు అన్నారు.
ఇదీ చదవండి : స్వయం సమృద్ధి వైపు మున్సిపాలిటీలు అడుగులు వేయాలి: సీఎం జగన్