అనంతపురం జిల్లా గుత్తి సబ్‌జైలును ఖైదీలకు కొవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైెెెఠాయించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుంటే మరోపక్క సబ్‌జైలును కొవిడ్ సెంటర్ గా మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు.
సబ్‌జైలు సమీపంలోనే సబ్‌రిజిస్ట్రార్, కోర్టు, తహసీల్దార్, హౌసింగ్, మున్సిపాలిటీ కార్యాలయాలు ఉండటంతో నిత్యం ప్రజలు వస్తూ పోతుంటారని... అలాంటి రద్దీ ప్రాంతాలలో ఖైదీలకు కొవిడ్ సెంటర్ చేయడం విడ్డూరమన్నారు.