అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో.. హిందూపురం వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మృతులు హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన రమేష్, గంగప్పలుగా గుర్తించారు. ప్రయాణికులను దింపేసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: