అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలకు అనంతపురం వేదిక కానుంది. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 4 నుంచి మూడు రోజులపాటు సభలు నిర్వహించనున్నట్టు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ తెలిపారు. మహా సభలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఐదు వేల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి...