అనంతపురం జిల్లాలో హిందూపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న వీరనారాయణ అనే కానిస్టేబుల్ బుక్కరాయసముద్రం మండలానికి చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ నిమిత్తం సంబంధిత సీఐ రాజశేఖర్రెడ్డి తనకు న్యాయం చేయకుండా తనపైనే...ఆరోపణలు చేస్తున్నారని మహిళ వాపోయింది. జిల్లా ఎస్పీని కలవడానికి వస్తే వీల్లేదంటూ అక్కడున్న పోలీసులు తనను వెనక్కుపంపించారని ఉన్నతాధికారులు ఈ కేసుపై ప్రత్యేక విచారణ చేసి తనకు న్యాయం చేయాలని మహిళ కోరింది. కానిస్టేబుల్ తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.
ఇదీ చూడండి