ETV Bharat / state

వృద్దుడితో నవ్వుతూ మాట్లాడాడు... నోట్లు కొట్టేశాడు! - పామిడి ఏటీఎంలో వృద్ధుడి నగదు

ఏటీఎమ్​లో డబ్బులు డ్రా చేస్తానని ఓ వృద్దునికి మాయమాటలు చెప్పి..అతని నగదంతా దోచుకున్నాడో ఓ వ్యక్తి. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో జరిగింది. పోలీసులు సీసీఫుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.

a man theft  oldman money at atm in pamidi
పామిడి ఏటీఎంలో వృద్ధుడి నగదు
author img

By

Published : Nov 7, 2020, 9:37 AM IST

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఏటీఎం కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని టీచర్స్ కాలనీ లో ఉన్న నంబర్ వన్ ఏటీఎం వద్ద ఓ వృద్ధుడిని..ఓ వ్యక్తి బురిడి కొట్టించాడు. గత నెల 29న పామిడి మండలం రామగిరి ఎగువ తాండ గ్రామానికి చెందిన వాలే నాయక్ అనే వృద్ధుడు..నగదు డ్రా చేసుకోవడానికి ఏటీఎమ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడే కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన హరికృష్ణ డబ్బులు డ్రా చేస్తానని వృద్ధుడికి మాయమాటలు చెప్పి...కార్డులోని నగదంతా దోచుకెళ్లాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్​ని పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుంచి రూ11,200 నగదు, సిండికేట్ బ్యాంక్ ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని కోర్టుకు హాజరు పరచి రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి. మమ్మల్ని చంపేయండి: అధికారుల వద్ద ఓ రైతు తల్లి మొర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.