అనంతపురం జిల్లా పామిడి మండలంలోని తంబళ్ల పల్లిలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గగన్రెడ్డి అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం సమీపంలోని తోటకు వెళ్తూ.. బాలుణ్ని తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ ఆడుకుంటూ గగన్రెడ్డి సమీపంలోని నీటికుంటలో పడిపోయాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు.. నీటి కుంటలో బాలుడి మృతదేహం గుర్తించారు. తమ బిడ్డ కళ్లముందే చనిపోవడం చూసిన వారు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: