ఆవులెన్నలో బాలుడి అదృశ్యం - a boy disappears in avulenna at anantapur
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఆవులెన్న గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు తప్పిపోయాడు. శివరాత్రి సెలవుల కోసం ఇంటికి వచ్చిన రాజేష్ తిరిగి వసతి గృహానికి బయలుదేరి మార్గమధ్యలో కళ్యాణదుర్గంలో దిగాడని తండ్రి నాగరాజు తెలిపారు. అప్పటి నుంచి కనబడకుండా పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.