అనంతపురం జిల్లా రాయదుర్గంలో నాలుగేళ్ల చిన్నారి ఆద్య డెంగీతో మృతి చెందింది. ఈమె స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతోంది. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న బాలికను తండ్రి నాగరాజు బళ్లారిలోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. నెల రోజులుగా మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 10 మంది డెంగీ లక్షణాలతో చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణం
రాయదుర్గం పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని స్థానికులు ఆగ్రహిస్తన్నారు. రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. పట్టణంలో పందుల బెడద అధికంగా ఉన్నా... పురపాలక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: