MLA Dharmasri Facing Problem in Gadapa Gadapaku: స్వాతంత్య్రం సిద్ధించి యేళ్లు గడుస్తున్నాయి.. ఆజాదికా అమృత్ మహోత్సవం అంటూ పండగలు జరుపుకున్నాం. ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు కానీ, ఆ ప్రాంత గిరిజన బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పుులు రాలేదు. గడపగడపకు కార్యక్రమం కోసం ఎమ్మెల్యే గుర్రం ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందటే వారి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గ్రామం ఎక్కడోకాదు సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రోడ్డు ద్వారా వెళ్లలేక గడప గడపకు అంటూ అన్ని ఊర్లూ తిరిగినట్లు వెళ్లే పరిస్థితి లేదని తెలిసిన ఆ ఎమ్మెల్యే కొద్ది దూరం గుర్రంపై.. మరికొంత దూరం బైక్పై ప్రయాణించి ఆ గ్రామానికి చేరుకున్నారు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్రంపై ప్రయాణించారు. నేటికి ఆ గ్రామానికి రోడ్డు లేకపోవటంతో గ్రామస్థులు మౌలిక సదుపాయాలకు దూరమైపోయారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కొంత దూరం గుర్రంపై మరికొంత దూరం ద్విచక్రవాహనంపై ప్రయాణించి గ్రామానికి వెళ్లారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వగా.. వారంతా ముక్త కంఠంతో తమ గ్రామానికి రోడ్డును మంజురు చేయించాలని కోరారు. గ్రామానికి రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: