Gas leak: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం రేగింది. సీడ్స్ దుస్తుల పరిశ్రమ సమీపంలో సుమారు 20 నిమిషాల పాటు విషవాయువు వ్యాపించింది. దీనివల్ల సెక్యూరిటీ సిబ్బంది శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సాధారణస్థితి నెలకొన్నట్లు విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఆదివారం కావడం వల్ల సెజ్‌లో సిబ్బంది ఎవరూ లేరని.. లేదంటే రెండు రోజుల క్రితం నాటి పరిస్థితి పునరావృతమయ్యేదని ఆందోళన వ్యక్తమైంది.
ఇవాళ వాయువు లీకైన విషయంపై బ్రాండిక్స్ కంపెనీ ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని.. విషవాయువు లీకైన ప్రాంతాన్ని పరిశీలించారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు సీడ్స్ కంపెనీ మూసివేస్తున్నట్లు ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు తెలిపారు. అచ్యుతాపురం పోలీసులు ఈ ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా నిఘా ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: