ETV Bharat / state

చంద్రబాబు స్క్రిప్ట్​.. పవన్​ కల్యాణ్​ యాక్టింగ్​: సీఎం జగన్​ - పవన్​పై మండిపడ్డ జగన్​

‍JAGAN FIRES ON CBN AND PAWAN : రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని ముఖ్యమంత్రి జగన్​ అన్నారు. నర్సీపట్నంలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించే ఏలేరు-తాండవ జలాశ్రయాలు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సభలో చంద్రబాబు, పవన్​పై తీవ్ర విమర్శలు చేశారు.

CM JAGAN
CM JAGAN
author img

By

Published : Dec 30, 2022, 4:02 PM IST

Updated : Dec 30, 2022, 4:10 PM IST

‍CM JAGAN ON CBN : సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రాజకీయం అంటే ఇదేనని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బహిరంగ సభలో స్పష్టం చేశారు. నర్సీపట్నంలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించే ఏలేరు-తాండవ జలాశ్రయాలు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపనతోపాటు.. నర్సీపట్నం పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపామన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని జగన్‌ ఆరోపించారు. ఫొటో షూట్ కోసం, జనాన్ని ఎక్కువ చూపడానికి ఒక చిన్న సందులోకి నెట్టి.. 8మందిని చంపేశారని చెప్పారు. రాజకీయం అంటే షూటింగ్ కాదని.. ఎస్సీ, ఎస్టీ మధ్య తరగతి జీవితాల్లో మార్పు తీసుకుని రావడమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏది చెప్తే.. పవన్​ కల్యాణ్​ అది చేస్తాడని విమర్శించారు. చంద్రబాబును చూస్తే కేవలం రెండే విషయాలు గుర్తుకువస్తాయన్న జగన్​.. అవి వెన్నుపోటు, మోసాలు అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్​ కల్యాణ్​ యాక్టింగ్​ చేస్తాడు

"చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక్క మంచి పని కూడా చేయలేదు. దత్తతండ్రిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు మరో దత్తపుత్రుడు. వీరి ఇద్దరి స్టైల్​ ఒక్కటే. ఈ రాష్ట్రం కాకపోతే.. మరో రాష్ట్రం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లు ఉంటుంది. వీరిద్దరి స్వరూపం చూస్తే.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, ఇదేం ఖర్మ మన రాజకీయానికి అని అనిపిస్తోంది"-సీఎం జగన్​

గతంలో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్న సీఎం జగన్.. నర్సీపట్నంలో రహదారుల విస్తరణ చేపడుతున్నామన్నారు. నర్సీపట్నంలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులే

"చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. మరో ఆయనకేమో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు. పవన్​కి చంద్రబాబు నిర్మాత, దర్శకుడు. చంద్రబాబు ఎప్పుడు షూటింగ్​ అంటే అప్పుడు కాల్​షీట్​లు ఇస్తాడు. బాబు స్క్రిప్ట్​ ఇస్తే ఈయన డైలాగ్​లు చెప్పి యాక్ట్​ చేస్తాడు" -సీఎం జగన్​

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.