Transporting Ganja in Alluri district: ఎప్పటిమాదిరిగానే పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో సుమారు 11 మంది యువకులు వీధుల్లో సామాగ్రిని అమ్మడానికి వెళ్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగులను తనిఖీ చేశారు. అందులో ప్యాకింగ్ చేసిన గంజాయి వెలుగు చూసింది. ఈ ఘటన అల్లూరి జిల్లా డొంకరాయిలో చోటు చేసుకుంది.
దీంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 45 బ్యాగులలో సుమారు ఆరు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. కోటి రూపాయలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఒడిశా, రాజస్దాన్, మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్.. రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు వెల్లడించారు. ఇలా బ్యాగులు మాటున గంజాయి తరలించడం అలవాటని డొంకరాయి ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇవీ చదవండి: