ETV Bharat / state

ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో వణికిస్తున్న చలి.. చలిమంటలతో సేదతీరుతున్న ప్రజలు - ఏపీ తాజా వార్తలు

SNOW AT AP : రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. కనిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతన్నారు. ఎక్కడికక్కడ చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.

SNOW AT AP
SNOW AT AP
author img

By

Published : Feb 6, 2023, 3:09 PM IST

SNOWFALL IN AP : రాష్ట్రంలో చలి తీవ్రత ఎంత మాత్రం తగ్గడం లేదు. తెల్లవారుజామున చలి పంజా విసురుతోంది. అల్లూరి జిల్లా పాడేరు ఏజన్సీలో చలి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచు, చలితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుంటూ చలి నుంచి కాపాడుకుంటున్నారు.

రథసప్తమి దాటినప్పటికీ, వేసవి సమీపిస్తున్నప్పటికీ చలి, పొగ మంచు ఆగలేదు. చలిమంటలు, ఉన్ని దుస్తులు ధరిస్తే కానీ బయటికి రాలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. లైట్ల వెలుతురులోనే వాహనాలు నడుస్తున్నాయి. సుమారు 10 నుంచి 20 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడంలేదంటే.. పొగముంచు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దట్టంగా ఏర్పడుతున్న పొగమంచు కారణంగా తెల్లవారుజామున పనులకు వెళ్లే కూలీలు, రైతన్నలు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వృద్దులు, చిన్నపిల్లలు శ్వాసకోస సమస్యలతో అల్లాడుతున్నారు.

అల్లూరిని వణికిస్తున్న చలి.. చలిమంటలతో సేదతీరుతున్న ప్రజలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.