ETV Bharat / state

ఏవోబీ సరిహద్దులో 15 అడుగుల కింగ్​ కోబ్రా.. చాకచక్యంగా పట్టివేత - 15 అడుగులు పొడవు ఉన్న ఆ పాము

Forest officials caught a huge kingcobra: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కన్‌ గిరి జిల్లా పిటకోటలో భారీ పామును చూసి గ్రామస్థులు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ సిబ్బంది... చాకచక్యంగా పామును బంధించారు.

huge kingcobra
భారీ పామును చూసి భయాందోళన చెందిన గ్రామస్థులు
author img

By

Published : Dec 24, 2022, 10:50 PM IST

15 Feets King Cobra: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మల్కన్​గిరి జిల్లా పిటకోటలో భారీ పాముని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. మల్కన్​గిరి జిల్లా కోరుకొండ సమితిలో గల పిటకోట గ్రామంలో పామును చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అనంతరము అటవీశాఖ సిబ్బంది, స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది సహాయంతో ఆ సర్పాన్ని పట్టుకున్నారు.

దాదాపు 15 అడుగులు పొడవు ఉన్న ఆ పామును చూడటానికి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు చేరుకున్నారు. పట్టుకున పామును అటవీ శాఖ అధికారులు భద్రపరిచారు. అటవీ ప్రాంతం కావడం వలన ఇటువంటి భారీ పాములు కనబడుతున్నాయని.. అటవీశాఖ రేంజర్ జగన్నాథ్ బిసోయి తెలిపారు. పాములు పర్యవరణానికి హానికరం కావనీ.. వాటిని ఇబ్బంది పెట్టనంత వరకు అవి మనుషులకు ఎలాంటి హాని చేయవని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలేస్తామని వెల్లడించారు. పామును పట్టే దృశ్యాలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్​గా మారాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.